Krishnaprema Logo

కృష్ణప్రేమ

చిలకలపూడి వారింటి కిలకిల పలుకులు ...

08 జులై, 2011

లక-బలపం తెచ్చావా?'

‘అది ఏనాటి మాట?'

‘పోనీ- పుస్తకం, పెన్నూ తెచ్చావా?'

‘మరీనూ.. ఇదీ ఎప్పటి మాట?'

‘వైట్ బోర్డ్ – మార్కర్ పెన్?'

‘ఈ మధ్యే ఇవీ హుష్ కాకి!

ఉన్నవల్లా computer, monitor, key-board, mouse,

and cell phone, without which there exists no house'

‘పోన్లే – అవేనా అఘోరించాయ్ – సంతోషం – ఏదీ ఆ man eater చూస్తూ అన్నం తింటూ అయ్యిందా నీ పని. ఇంకా బుద్ధిగా నే చెప్పినవన్నీ సరిగా టైప్ చేసావంటే నీకు బోలెడంత అప్పిస్తాను, సరేనా?'

‘అప్పు –మీరివ్వనక్కర్లె- మాకు క్రెడిట్ కార్డులున్నాయి. వాటితో సినిమాలు కూడా తీయొచ్చు'

‘ఆ( - పెద్ద చెప్పొచ్చావ్.. మీరు ఇప్పటి సినిమాలే ధియేటర్ కి వెళ్లి చూడరు. ఇంకా మా కాలంవి ఏం చూస్తారూ? సినిమాలు తియ్యడం కూడానా?'

‘మాకు యూ ట్యూబు లుంటాయి – ఏది కావాలన్నా చూడగలం. అయినా యాభై ఏళ్ళ కిందట వచ్చిందే మీ మాయాబజార్ – దాన్ని కొత్తగా రంగుల్లో ముంచెత్తారు. అది మాత్రం ధియేటర్ లోనే చూసాం'

‘ఝే(విటీ -- రంగుల్లోనా? నా తెల్ల గెడ్డం తెల్లగానే ఉంచారా? మార్కస్ బార్ట్లే తీసిన వెన్నెల సీను రంగుల్లో ఏం బావుంటుందీ? ట్యూబుల్లోంచి సినిమాలు చూడడమా? ఇంతకీ వీటిల్లో నేనేమన్నా అగపడతున్నానా లేదా? నాదసలే ఆజానుబాహు విగ్రహం. ఇంతకీ నా పద్యాలుంటాయా? పాటలుంటాయా??'

‘అవా? వాటికైతే వెబ్బులు వెతకాలి'

‘నీళ్ళ కోసం మబ్బులు వెతికినట్టు నా పద్యాల కోసం.. ఏమిటవీ.. వెబ్బులు వెతకాలా? ఏమిటీ సాలెగూళ్ళతో మంతనాలు?'

మీలాంటి వారంటే గూడు కట్టుకున్న అభిమానం ఉన్న వాళ్లకి ఇక్కడే ఒక చోట వీబ్లీ సైటులో అవన్నీ సాధ్యమౌతున్నాయి '

‘మళ్ళీ మరో కొత్త మాటా? వీబ్లీ ఏమిటీ హుబ్లీ లాగ. అయినా నేను పానగల్లు పార్కులో బాతాఖానీ చేసే వాణ్ణే ఆ ఫోటో ఒక్కటైనా ఎవరి దగ్గరైతే ఉందో వాళ్ళే అనంత పద్మనాభుడి కన్న గొప్ప వాళ్ళు '

‘అరె. ఈ వార్త మీ దాకా వచ్చిందీ?'

‘ఎందుకు రాదూ- ఈ ఏడాది అంటే 2011 లో ఈ జులైలో ఇంగ్లీష్ 11 వ తేదీ ఉందే అదే రోజు మన ఇండియా అంతటికీ 11 వ తిథి , అదేనోయ్ , ఏకాదశి – ఆషాఢ మాసం శుక్ల పక్షం ఏకాదశిని శయనైకాదశి అంటారు. అది ఈ అనంత శయనుడిదే అంటే పద్మనాభుడిదే. నా గొప్ప అనుకోకు గానీ – ఈ ఇంగ్లీష్ రోజునే నేను పుట్టాను. సరే నే చెప్తా రాసుకో అన్నవి నువ్వు రాసేట్టు లేవు గానీ ఒక మాట చెబుతా విను. బరంపురం విన్న'కోట' వారితో మేం వియ్యమందితే వారి తాతి'రాజు' వారు మాకు పరిచయమయ్యేరు- మా అల్లుడు లక్ష్మీనారాయణ్ అంటే మా మంజులమ్మాయ్ భర్త అనే వాడు- రాజులేని కోట (వారిది) –కోట లేని రాజు (వీరు) అనీ. మా అల్లుడి మేనల్లుడు నా గురించి రాస్తాడు. ఇదిగో మా అ.మే అబ్బాయ్- అఆ ఇఈ అంటూ ఇప్పుడా అక్షరాభ్యాసం? నువ్వేదో నన్ను గురించి పెన్ను పట్టుకునీ ఏదో గిలుకుతావనుకుంటే..'

‘మీరంటున్న ఆ అ. మే. అబ్బాయే ఆ వీబ్లీ లో ఈ పూట నా మాట అంటూ పూట పూటకో మాట ,మాట మాటకో పాట అప్పచెబుతున్నాడండీ'

‘సంతోషం – అయితే మనమెందుకిక్కడ? రంగ రంగ అనుకోక?'

‘అలా అనుకోడానికే ఎస్ వీ రంగా రావు పాటల కొలువు పేర్చాడు'

‘కొలువైతివా రంగ శాయి'!