నిత్య స్మరణీయులు
25 ఏప్రిల్, 2011


భవ సాగరమన్నది
భగవంతుని నిర్ణయమైతే
సత్సంగ్ ఒక్కటే నావ యనీ
సాటి మానవ సేవయే త్రోవయనీ
స్వచ్ఛమైన ప్రేమయే తెడ్డు అనీ
చాటి చెప్పి
సుదూర తీరాలకు తరలి పోయిన
దివ్య సరంగు
సత్యసాయి
నిత్య స్మరణీయులు
ఒక ఉత్తరాషాఢ నుండి మరొక ఉత్తరాషాఢ వరకు చేసిన
ఒక సంపూర్ణ చంద్ర మాస యానంలో ఆ తనువు రేవు దాటింది.
ఆ ఆత్మ సూర్య తేజస్సుతో మళ్ళీ ఉద్భవిస్తుందని
క్షణ క్షణం దక్షిణం ఆశతో ఎదురు చూస్తూ ఉంది.
- డా. తాతిరాజు వేణుగోపాల్, 25 ఏప్రిల్ 2011****