బాపురే రమణీయం...!!!
12 ఫిబ్రవరి, 2011


బొమ్మలు గీసి, ఆ బొమ్మలకి కిసుక్కున నవ్వు తెప్పెంచే వ్యాఖ్య రాసి తెలుగు వాళ్ళ ఆరోగ్య పధకానికి ఎప్పుడో నాంది పలికిన ద్విజులు సత్తిరాజు లక్ష్మినారాయణ, ముళ్ళపూడి వెంకట రమణ. ఆ ముందాయన పేరుందే అది పెద్దగా ఉందా ?
సరే.
ఎవరక్కడ?
చిత్తం.
'బాపు' అనే పేరును వెంటనే ఇక్కడ ప్రవేశ పెట్టండి.
చిత్తం, మరి ఇంకో బాపు - మనకి స్వతంత్రం తెచ్చిపెట్టిన బాపు ఉన్నారే...
'తెలుసులేవోయి. ఈయనా గొప్పే. ఎటొచ్చీ బొమ్మలు గీయడంలో మా గొప్ప స్వతంత్రం తీసుకు వచ్చ్చాడు'.
'అలా చెప్పండి. మరి ఆ రెండో ఆయన పేరు చాలా పొడుగు...'
'అతను తెలుగు వాళ్లకి బుడుగు'
'ఆ గదిలో ఎవరో లాఫింగ్ క్లబ్బు ట--తెగ రెచ్చి పోతున్నారు'
'నవ్వాపుకోలేక దగ్గి దగ్గి కళ్ళనిండా నీళ్ళు నింపుకునీ మీకెవరైనా ఎప్పుడైనా ఎదురు పడితే కచ్చితంగా వాళ్ళు బాపు కార్టూన్లు చూసి వస్తూ ఉండాలి లేదా ముళ్ళపూడి కథలు చదువుకొని వచ్చి ఉండాలి. పొరపాట్న మీరు ట్రైన్లో ఏ పాట్నాకో, విశాపట్నంకో బయలుదేరినట్లయితే, మీతో పాటూ బాపు కార్టూన్ల పుస్తకం ఉన్నట్టైతే, మీది కింది బెర్తు అయినట్టయితే జర భద్రం కొడకో --మీరు అస్తమానూ నవ్వుతుంటే ఎదుటి వాడు కాంప్లెక్సు లో పడి ఆత్మన్యూనతా భావంతో ఏదైనా 'ఓఘోయిత్యం' చేసుకోవచ్చు. అందుకనీ ఎంచక్కా పై బెర్తు ఎక్కేసి కడుపారా నవ్వుకోండి.
ఈ డాక్టర్లు ఇద్దరికీ కలిపి ఒక పద్మ అవార్డు ఎలా ఇవ్వడమో ప్రభుత్వానికి తెలియటంలేదు. ఆ కోపంతో ఎన్నో స్వచ్చంద సంస్థలు వారికి అడపా దడపా అవార్డులు ఇస్తున్నాయి.వారికిచెన్నైలో****ఘంటసాల పురస్కారం ఇటీవల** లభించింది.**
కనులు తెరచినా పాటే , కనులు మూసినా పాటే లో చూడండి,వినండి.. బాపురే రమణీయం!
(మహాబలిపురం చెన్నై సముద్ర తీరం లోనే ఉంది కదా -- బాలరాజు ఏమంటున్నాడో బాపు ఏం చూపిస్తున్నారో వినండి, చూడండి)
చిరునవ్వులోని హాయి లో కార్టూన్లు ఉన్హ ఉన్హ ఉన్హాయి.
ఇదే ఈ పూట నా మాట...
-డాక్టరు (వైద్యుడు కాదు) తాతిరాజు వేణుగోపాల్ (12.2.2011)